ఈ ఏడాది ఐపిఎల్ పూర్తిగా రద్దు…!

-

ఈ ఏడాది ఐపిఎల్ ని పూర్తిగా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ప్రస్తుతం కరోనా వైరస్ దేశంలో విలయతాండవం చేస్తుంది. క్రమంగా దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఏ విధంగా కట్టడి చెయ్యాలి అనుకున్నా సరే అది కట్టడి కావడం లేదు. దీనితో లాక్ డౌన్ ని అమలు చేసారు. అయినా సరే అది కట్టడి కావడం లేదు.

ఇప్పటి వరకు మన దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 1300గా ఉంది. కరోనా కట్టడి అయ్యే అవకాశాలు ఇప్పట్లో లేవని అంటున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా విస్తరిస్తుంది కాబట్టి ఈ ఏడాది పూర్తిగా క్రికెట్ టోర్నమెంట్ లు అన్నీ కూడా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అలాగే సినిమాలను కూడా నిలిపివేసే అవకాశాలు ఉన్నాయి. కరోనా ఇప్పుడు ప్రారంభ దశలో ఉంది. అది మరింత పెరిగితే చేసేది ఏమీ ఉండదు.

అందుకే క్రికెట్ టోర్నీ లను ప్రపంచ వ్యాప్తంగా రద్దు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ని కూడా రద్దు చెయ్యాలని చూస్తున్నారు. దీని ఆధారంగా చూస్తే ఈ ఏడాది ఐపిఎల్ లేదు. ముందు జూన్, జూలై లో ఉండే అవకాశం ఉందని భావించారు. కాని అది కూడా సాధ్యం అయ్యే అవకాశాలు దాదాపుగా లేవు అనే చెప్పాలి. దీనితో పూర్తిగా ఈ ఏడాది రద్దు చేసే యోచనలో ఉన్నారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news