VIRAT KOHLI : లైవ్‌లో కనిపించిన కోహ్లి కుమార్తె.. వీడియో వైరల్

-

టీమిండియా- సౌతాఫ్రికా జట్లు మధ్య నిన్న చిట్ట చివరి మ్యాచ జరిగిన సంగతి తెలిసిందే. అయితే… సౌతాఫ్రికా తో ఈ మూడో వన్డే నేపథ్యంలో… టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కుమార్తె వామికా లైవ్‌ లో దర్శనమిచ్చింది. స్టాండ్స్‌ లో విరాట్‌ కోహ్లీ భార్య అనుష్క శర్మ చేతుల్లో ఉండగా.. కెమెరా కంటికి చిక్కింది. ఈ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

ఇందులో వామిక ముఖం స్పష్టంగా కనిపించక పోవడంతో… అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. కాగా.. విరాట్‌ కోహ్లీ దంపతులు మొదటి నుంచి చిన్నారి వామిక ముఖాన్ని మీడియా కంట పడకుండా జాగ్రత్త పడుతున్న సంగతి తెలిసిందే. కోహ్లీ – అనుష్క దంపతులకు వామిక.. గతేడాది జనవరి 11వ తేదీన జన్మించింది.చిట్ట చివరి వన్డే మ్యాచ్‌ లోనూ టీమిండియా దారుణంగా ఓటమి పాలైంది. 4 పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం సాధించి… సిరీస్‌ ను ఎగురేసుకుని పోయింది.

Read more RELATED
Recommended to you

Latest news