టీం ఇండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానె శుక్రవారం సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర ట్వీట్ చేసాడు. “వడా పావ్” తినడం గురించి దాని ప్రాధాన్యత గురించి సోషల్ మీడియాలో తన అభిమానులకు కొన్ని ప్రశ్నలు వేసాడు. “మీ వడా పావ్ మీకు ఎలా నచ్చుతుంది? 1. చాయ్ తో వడా పావ్, 2. పచ్చడితో వడా పావ్, 3. జస్ట్ వడా పావ్” అని రహానే ఒక ట్వీట్ లో అభిమానులను ప్రశ్నించాడు రహానే.
దీనిపై బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ స్పందించాడు. “రెడ్ చట్నీ, లైట్ గ్రీన్ చట్నీ మరియు కాస్త ఇమ్లీ పచ్చడితో నా వాడా పావ్ కాంబినేషన్ చాలా బాగుంటుందని రిప్లయ్ ఇచ్చాడు సచిన్. గతంలో కూడా సచిన్ వడా పావ్ గురించి వివరించాడు. తాను మసాలా ‘వడా-పావ్’ ను ఇష్టపడతా అని పేర్కొన్నాడు. “నేను మరియు నా కొడుకు (అర్జున్) శివాజీ పార్క్ జింఖానాలో వడా-పావ్ తినడానికి ఇష్టపడతాము.
‘చట్నీ’తో ఉండే ఈ చిరుతిండిని కొట్టేది ఏదీ లేదని 2011 లో మరాఠీ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. అది అలా ఉంటే ప్రస్తుతం టీం ఇండియాలో టెస్ట్ లకు మాత్రమే ఆడుతున్న రహానే న్యూజిలాండ్ పర్యటనకు సన్నద్ధమవుతున్నాడు. ఫిబ్రవరి 7 నుంచి 10 మధ్య న్యూజిలాండ్‌తో జరిగే రెండో ఇండియా ‘ఎ’ నాలుగు రోజుల మ్యాచ్ లో రహానే ఆడుతున్నాడు. ఫిబ్రవరి 21 నుంచి భారత్ కివీస్ తో రెండు టెస్టులు ఆడనుంది.
I like my Vada Pav with red chutney, very little green chutney & some imli chutney to make the combination even better?
— Sachin Tendulkar (@sachin_rt) January 10, 2020