ICC Rankings : ర్యాంకింగ్స్‌ లో చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లీ

-

ఆదివారం పాకిస్తాన్ పై భారత్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 159 పరుగులు చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయింది. 160 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా టార్గెట్ ను చేరుకుంది. ఈ మ్యాచ్ విజయానికి అసలైన కారకుడు విరాట్ కోహ్లీ.

30 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమిండియాను విజయతీరాలకు చేర్చి వరల్డ్ క్లాస్ ప్లేయర్ గా ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు విరాట్ కోహ్లీ.

టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్ లో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ విరాట్ కోహ్లీ ఒక్కడే. అలాగే టి20 ఇంటర్నేషనల్ లోనూ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్‌ లో 82 పరుగులు చేసిన విరాట్‌ కోహ్లీ.. ఐసీసీ ర్యాంకింగ్స్‌ లోనూ దూసుకొచ్చాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌ లో విరాట్‌ కోహ్లీ.. 9వ స్థానంలో నిలిచాడు.

టాప్-10 T20I బ్యాటర్లు (అక్టోబర్ 26, 2022 నాటికి)

మహ్మద్ రిజ్వాన్ (రేటింగ్: 849)
డెవాన్ కాన్వే (రేటింగ్: 831)
సూర్యకుమార్ యాదవ్ (రేటింగ్: 828)
బాబర్ ఆజం (రేటింగ్: 799)
ఐడెన్ మార్క్రామ్ (రేటింగ్: 762)
డేవిడ్ మలన్ (రేటింగ్: 754)
ఆరోన్ ఫించ్ (రేటింగ్: 681)
పాతుమ్ నిస్సాంక (రేటింగ్: 658)
విరాట్ కోహ్లీ (రేటింగ్: 635)
ముహమ్మద్ వసీం (రేటింగ్: 626)

 

Read more RELATED
Recommended to you

Latest news