విరాట్ కోహ్లీ ఈ పేరు తెలియని భారతీయుడు ఉండరంటే అతిశయోక్తి కాదు. క్రికెట్ తెలియని వారికి కూడా విరాట్ కోహ్లీ గురించి తెలుసు. ఈ రన్ మెషీన్ గురించి ఏ విషయమైనా సరే అభిమానులకు ఆసక్తే. అందుకే ఏం జరిగినా విరాట్ గురించి గూగుల్లో వెతికేస్తుంటారు. అయితే.. తాజాగా విరాట్ కోహ్లీ….స్పోర్ట్స్ లైఫ్ స్టైల్ బ్రాండ్ ప్యూమాతో తెగదింపులు చేసుకున్నాడు.
8 ఏళ్ల ఒప్పందాన్ని మధ్యలోనే ముగించాడు. విరాట్ మున్ముందు ప్యూమా ఇండియా మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ గంగోలి స్థాపించిన అజిలిటాస్ స్పోర్ట్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు. ఈ క్రమంలోని వ్యూమాను వీడినట్లు తెలుస్తోంది. 2017లో కోహ్లీ ఎనిమిదేళ్ల కాలానికి వ్యూమాతో రూ.110 కోట్ల ఒప్పందం చేసుకున్నారు. ఇది ఈ ఏడాది చివర్లో ముగియనుంది. ప్యూమా బ్రాండ్ అంబాసిడర్ గా కోహ్లీ బిల్ బోర్డ్ లు, టెలివిజన్ స్క్రీన్ లు మరియు వివిధ సోషల్ మీడియా వీడియోల్లో కనిపించారు.