టీమ్‌ ఇండియా కోచ్‌గా ధోనీ?.. బీసీసీఐకి కోహ్లీ కోచ్‌ ప్రపోజల్‌

-

టీమ్‌ ఇండియా కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకునే గడువు మే 27వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఎవరెవరు అప్లై చేసుకున్నారనే అంశంపై బీసీసీఐ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. తాజాగా విరాట్ కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ టీమిండియా హెడ్ కోచ్ పదవిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ పదవికి ఎంఎస్ ధోనీ పేరును సూచించారు.

“మొదట, ఈ పోస్ట్‌కు ఎవరు దరఖాస్తు చేసుకున్నారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. కోచ్‌గా ఎవరు వచ్చినా భారతీయుడే ఉండాలని నేను కోరుకుంటున్నాను. మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తే, అతను గుడ్‌ ఆప్షన్‌ అవుతాడు. ధోని ఎక్కువ కాలం క్రికెట్ ఆడాడు, పెద్ద టోర్నమెంట్‌లు గెలుచుకున్నాడు” అంటూ రాజ్ కుమార్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

మరోవైపు ఇటీవల బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా భారతీయ కోచ్‌ కోసం వెతుకుతున్నామంటూ వెల్లడించారు. ఆస్ట్రేలియా కోచ్‌లను సంప్రదించినట్లు వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు. అయితే వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఆసక్తి చూపకపోవడం వల్ల, ఇక గంభీర్‌కే ఛాన్స్‌ ఉందని అందరూ భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news