సంక్షోభంలో వెస్టిండీస్ క్రికెట్, ఆటగాళ్లకు డబ్బులు ఇవ్వని బోర్డు…!

-

వెస్టిండీస్ క్రికెట్ లో ఆర్ధిక సంక్షోభం ఇప్పుడు తీవ్రంగా వేధిస్తుంది. ఆ దేశ ఆటగాళ్లకు ఈ ఏడాది జనవరి నుంచి మ్యాచ్ ఫీజ్ చెల్లించలేదు బోర్డ్. ఆర్ధిక కష్టాలు ఉండటంతో ఆటగాళ్లకు జీతాలు ఇవ్వలేదు బోర్డు. ఆటగాళ్ల రిటైనర్ క్లియర్ అయినా సరే క్రికెట్ వెస్టిండీస్ (సిడబ్ల్యుఐ) తమ ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజ్ ఇవ్వలేదని పేర్కొంది. భారీగా జీతాలు పెండింగ్ లో ఉన్నాయని బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది.

ఫస్ట్-క్లాస్ ఆడిన ఆటగాళ్ళకు ఇప్పటి వరకు మ్యాచ్ ఫీజ్ చెల్లించలేదు అని… జనవరిలో ఐర్లాండ్‌తో జరిగిన హోమ్ సిరీస్‌కు పురుషుల జట్టుకు మ్యాచ్ ఫీజు చెల్లించలేదని తాజాగా ఒక కథనం బయటకు వచ్చింది. అప్పుడు మూడు వన్డేలు ఆడారు ఆటగాళ్ళు. అలాగే మూడు టి 20లు కూడా ఆడారు. అలాగే ఫిబ్రవరి-మార్చిలో శ్రీలంక పర్యటనలో మూడు వన్డేలు మరియు రెండు టి 20లు ఆడారు ఆటగాళ్ళు.

ఆస్ట్రేలియాలో ఫిబ్రవరి-మార్చిలో జరిగిన టీ 20 ప్రపంచ కప్‌లో మహిళలు ఆడిన నాలుగు మ్యాచ్‌లకు మ్యాచ్ ఫీజు చెల్లించవలసి ఉంది. సిడబ్ల్యుఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జానీ గ్రేవ్ మాట్లాడుతూ త్వరలోనే ఈ ఫీజులు చెల్లిస్తామని అన్నారు. క్రికెట్ వెస్టిండీస్ ఆర్థికంగా చాలా కష్టాలను ఎదుర్కొంటోందని అన్నారు. తమ ముందు ఇది పెద్ద సమస్య అని ఆయన పేర్కొన్నారు.

2018 లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు దేశంలో పర్యటించిన నాటి నుంచి ఈ నష్టం ఉందని ఆ రెండు జట్లకు ఆతిధ్యం ఇచ్చిన సమయంలో 22 డాలర్లు నష్టపోయామని ఆయన పేర్కొన్నారు. మీడియా హక్కుల ఒప్పందంలో భాగంగా ఆ రెండు పర్యటనల కోసం తమకు మిలియన్ డాలర్ల కన్నా తక్కువ మొత్తం చెల్లించారని ఆయన వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news