ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీలో భారత్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటి వరకు టోర్నీలో ఓటమి ఎరుగని జట్టుగా ముందుకు సాగుతున్న టీమిండియా ఆ ఘనతను ఈ మ్యాచ్‌లోనూ నిలబెట్టుకుంది.
ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీలో భారత్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటి వరకు టోర్నీలో ఓటమి ఎరుగని జట్టుగా ముందుకు సాగుతున్న టీమిండియా ఆ ఘనతను ఈ మ్యాచ్‌లోనూ నిలబెట్టుకుంది. ఇవాళ మాంచెస్టర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే ప్రపంచ కప్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. విండీస్‌పై భారత్ 125 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 268 పరుగుల స్కోరు చేసింది. భారత బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ కోహ్లి (82 బంతుల్లో 72 పరుగులు, 8 ఫోర్లు), వికెట్ కీపర్ ధోనీ (61 బంతుల్లో 56 పరుగులు నాటౌట్, 3 ఫోర్లు, 2 సిక్సర్లు)లు రాణించారు. ఇక విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్ 3 వికెట్లు తీయగా, షెల్డన్ కాట్రెల్, కెప్టెన్ జేసన్ హోల్డర్‌లు చెరో 2 వికెట్లు తీశారు.
అనంతరం 269 పరుగుల విజయ లక్ష్యంతో ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ 34.2 ఓవర్లలో 143 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. భారత బౌలర్లను ఎదుర్కొనడంలో విండీస్ బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. కాగా భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 4 వికెట్లు తీయగా, బుమ్రా, చాహల్ లకు చెరో 2 వికెట్లు దక్కాయి. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్‌లు చెరొక వికెట్ తీశారు.