గంగూలీకి సుప్రీం కోర్ట్ షాక్ ఇస్తుందా…?

-

జస్టిస్ నాగేశ్వర్ రావు నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం డిసెంబర్ 9 న అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షా పదవీకాలాన్ని పొడిగించడంతో సహా బోర్డ్ రాజ్యాంగంలో మార్పుల కోసం భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) పిటిషన్ ను విచారించనుంది. జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ అజయ్ రాస్తోగిలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం చేపడుతున్న విచారణ కాస్త సంచలనం అయ్యే అవకాశం ఉంది.

చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సిజెఐ) ఎస్‌ఐ బొబ్డే నేతృత్వంలోని న్యాయమూర్తుల ధర్మాసనం జూలైలో బిసిసిఐ కి సంబంధించిన ఒక పిటీషన్ ను విచారించింది. లోధా కమిటీ సిఫార్సులు అమల్లోకి వచ్చిన తరువాత, బిసిసిఐ ఆఫీసు-బేరర్లు 6 సంవత్సరాలు రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ లేదా భారత క్రికెట్‌ బోర్డ్ లో ఆఫీసు-బేరర్‌ గా పనిచేసిన తరువాత 3 సంవత్సరాలు మూడు ఏళ్ళ పాటు పదవులకు దూరంగా ఉండాలి. గంగూలీ మరియు షా 2019 అక్టోబర్‌ నుంచి బిసిసిఐ అధ్యక్షుడిగా మరియు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. వాళ్ళు ఇద్దరూ కూడా ఆరేళ్ళకుపైగా పదవుల్లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news