T20 World Cup : టీమిండియాకు షాక్‌ తప్పదా… గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?

-

టీ 20 ప్రపంచక 2023కి ముందు భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుత ఫామ్ లో కనిపిస్తోంది. ఫిబ్రవరి 10 నుంచి దక్షిణాఫ్రికాలో టి20 ప్రపంచ కప్ ప్రారంభం కానుండగా, అంతకుముందు మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. టి20 ప్రపంచ కప్ లో టీం ఇండియాకు ఇప్పటివరకు కలసిరాలేదు. ఏడుసార్లు జరిగిన ఈ టోర్నిలో నాలుగు సార్లు సెమీఫైనల్, ఒకసారి ఫైనల్ ఆడిన ఇప్పటివరకు ప్రపంచ ఛాంపియన్ టైటిల్ ను అందుకోలేకపోయింది. టీ 20 ప్రపంచ కప్ లో టీమ్ ఇండియా ప్రదర్శన ఎలా ఉందో టోర్నీ ప్రారంభానికి ముందే తెలుసుకుందాం.

2009లో ఇంగ్లాండులో జరిగిన టి20 ప్రపంచ కప్ లో భారత మహిళల జట్టు సెమీఫైనల్ కు చేరుకుంది. నాకౌట్ మ్యాచ్ లో 52 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 93 పరుగులకే ఆల్ అవుట్ అయింది. 2010లో వెస్టిండీస్ లో జరిగిన టి20 ప్రపంచ కప్ లో సెమీస్ లో టీమిండియా మరోసారి ఓటమిపాలైంది. ఈసారి ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో టీమ్ ఇండియాను ఓడించింది.

2012లో శ్రీలంకలో జరిగినటువంటి ప్రపంచ కప్ లో టీమిండియా ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. 2014లో బంగ్లాదేశ్ లో జరిగిన టి20 ప్రపంచ కప్ లో టీమిండియా మరోసారి సెమీఫైనల్ లోకి ప్రవేశించలేకపోయింది. 2016లో టీమిండియా మరోసారి సెమీఫైనల్ కు చేరుకోలేకపోయింది. 2018 టీ20 ప్రపంచకప్ వెస్టిండీస్ లో జరిగింది. ఈసారి మళ్లీ సెమి ఫైనల్ కు చేరుకుంది. 2020లో టి20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాలో జరిగింది. ఈసారి టోర్నీలో టీమ్ ఇండియా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఫైనల్స్ కు చేరుకుంది. కానీ ఆతిథ్య ఆస్ట్రేలియా మాత్రం ఛాంపియన్ కావాలన్న టీమిండియా కలను చెరిపేసింది.

Read more RELATED
Recommended to you

Latest news