విజయవాడలో దారుణం..యువతిపై పెట్రోల్‌ పోసి..

-

విజయవాడ హనుమాన్‌ పేటలో మరో దారుణం జరిగింది..తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఓ ప్రైవేటు పార్శిల్‌ కార్యాలయంలో యువతిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు యువకుడు..ఘటనా స్థలంలోనే మంటల్లో యువతి సజీవ దహనమయ్యింది..ఆ మంటలు యువకుడికి అంటుకుని తీవ్రగాయాలయ్యాయి. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది..బాధితురాలు విజయవాడలోని ఓ ప్రైవేటు కోవిడ్‌ సెంటర్‌లో నర్సుగా విధులు నిర్వహిస్తోంది..అయితే గత కొంతకాలంగా యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు యువకుడు..యువకుడిపై గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది యువతి..మళ్లీ యువతి జోలికి వెళ్లనని యువకుడు చెప్పడంతో వివాదం సర్ధుమనిగింది..తాజాగా మళ్లీ యువకుడు యువతిని వేధించడం ప్రారంభించటంతో యువతని అతని ప్రేమను తిరస్కరించింది..తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు.

Read more RELATED
Recommended to you

Latest news