స్టేజ్ పైనే అవినాష్ ను లైవ్ లో ఇరికించేసిన శ్రీముఖి.. కట్ చేస్తే..!

-

బుల్లితెర రాములమ్మ గా తిరుగులేని యాంకర్ గా దూసుకుపోతోంది శ్రీముఖి. ఏ ఛానల్ చూసినా.. ఏ షో చూసినా ఈమెదే అన్నట్లుగా హల్చల్ చేస్తోంది. ఫలితంగా ప్రేక్షకులకు నిత్యం టచ్ లో ఉంటూనే తన రేంజ్ ను మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్న శ్రీముఖి.. అదే సమయంలో తన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తూ బాగా హైలైట్ అవుతుంది. ఇక ఈ క్రమంలోనే తాజాగా యాంకర్ శ్రీముఖి ఒక షోలో ప్రముఖ కమెడియన్ అవినాష్ ను వింత ప్రశ్న అడిగి షాక్ ఇచ్చింది. తాజాగా శ్రీముఖి స్టార్ మా చానల్లో “ఆదివారం విత్ స్టార్ మా పరివారం” షో చేస్తున్న విషయం తెలిసిందే.

ఆదివారం ప్రసారం అయ్యే ఈ కార్యక్రమంలో బుల్లితెర ప్రముఖులు గెస్ట్లుగా వచ్చి గేమ్స్ ఆడుతుంటారు. ఇందులో శ్రీముఖి తో పాటు ప్రముఖ కమెడియన్ అవినాష్ కూడా సందడి చేస్తున్నాడు. ఇలా వీళ్ళిద్దరి కాంబినేషన్ ప్రేక్షకులకు ఒక రేంజ్ లో మజాను అందిస్తోంది. తాజాగా ఈ వారం సంబంధించి..” అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు”, ” కృష్ణా ముకుందా మురారి” సీరియల్స్ లోని నటీనటులు రెండు టీంలుగా ఏర్పడి పోటీపడ్డారు. వీళ్ళతో యాంకర్ శ్రీముఖి ఎన్నో గేమ్స్ ఆడించింది. అలాగే అవినాష్ కామెడీ తో మరింత రసవత్తరంగా సాగుతూ నవ్వు తెప్పించారు.

టాస్క్ లో భాగంగా అమ్మాయిలను ఎత్తుకున్న అవినాష్ దగ్గరికి వచ్చి యాంకర్ శ్రీముఖి.. నిన్ను పర్సనల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను..నిజంగా సమాధానం చెప్పాలి. ఒక ఫ్రెండ్ గానే నిన్ను ఇది అడుగుతున్నా..పెళ్లయిన తర్వాత మీ ఆవిడ అనూజాను ఎన్నిసార్లు ఎత్తుకొని ఉంటావు ? నిజం చెప్పు.. లేకుంటే నేను మీ ఆవిడకి ఫోన్ చేసి అడుగుతా.. అని అంది. దీంతో అక్కడున్న వాళ్లంతా నమ్ముకున్నారు. అయితే చాలా సేపు ఆలోచించిన తర్వాత అవినాష్ ఒక ఏడుసార్లు ఎత్తుకొని ఉంటాను అని చెప్పాడు. దీంతో శ్రీముఖి లైవ్ లో అనూజా కు ఫోన్ చేసి అవినాష్ నిన్ను ఎన్నిసార్లు ఎత్తుకున్నాడు అని అడగ్గా.. ఆమె నాలుగు సార్లు ఎత్తుకున్నాడు అని చెప్పింది. దీంతో అక్కడున్న వాళ్లంతా అవినాష్ పైకి దూసుకొచ్చారు.. అవినాష్ కవర్ డ్రైవ్ చేసే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే ఇప్పుడు ఈ ప్రోమో వైరల్ గా మారుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news