కుంకుమపువ్వు అంటే.. గర్భిణులు మాత్రమే వాడతారు అనుకుంటారు కానీ.. ఇది ఎవరైనా ఏ వయసు వారైనా వాడొచ్చు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన, గొప్ప ఔషధ గుణాలు ఉన్న కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ, టీకి బదులుగా కుంకుమ పువ్వు నీళ్ళు తాగడం వల్ల బోలెడు ప్రయోజనాలు పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.. మహిళలకి ఇది చాలా మేలు చేస్తుందట. ఆ ప్రయోజనాలేంటో చూద్దామా..!
మెరిసే చర్మం- గర్భిణీలు కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డలు తెల్లగా పుడతారని అంటారు.. అది ఎంత వరకు నిజమో తెలియదు కానీ.. ఇక్కడ కుంకుమ పువ్వు నీళ్ళు తాగిన తర్వాత చర్మానికి ఆరోగ్యం లభించడంతోపాటు మంచి మెరుపు వస్తుందట.
కెఫీన్ కంటే మేలే- ఉదయం టీ, కాఫీ తాగనిదే కొంతమందికి తెల్లారదు. కాస్త చిరాకుగా అనిపిస్తే చాలు.. కాఫీ, టీ తాగాల్సిందే.. ఇలా మనకు తెలియకుండా వాటికి మనం బానిసలైపోయా.. కానీ కుంకుమ పువ్వు నీళ్ళు తాగడం వల్ల కెఫీన్ వల్ల పొందే ప్రయోజనాల కంటే ఎక్కువ లాభాలు పొందవచ్చట. ఒకటి లేదా రెండు కప్పులు కుంకుమ పువ్వు నీళ్ళు తాగడం మంచిదని నిపుణులు అంటున్నారు.
జుట్టుకు మంచిది- ఈరోజుల్లో జుట్టు రాలడం అబ్బాయిలు, అమ్మాయిలు అందరికీ.. పెద్ద సమస్యగా మారింది. ఈ నీళ్ళు తాగడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది..
పీరియడ్స్ నొప్పి నివారణ- కుంకుమ పువ్వు నీళ్ళు తాగడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు..
కుంకుమ పువ్వు నీళ్ళు ఎలా తయారు చేయాలి?
కుంకుమపువ్వు- 5,6 రేకులు
దాల్చిన చెక్క- ఒక అంగుళం ముక్క
యాలకులు- రెండు
బాదం- 4 లేదా 5
తేనె
తయారీ విధానం
దాల్చిన చెక్క, కుంకుమ పువ్వు, యాలకులు నీటిలో వేసి ఐదు నిమిషాల పాటు తక్కువ మంట కింద మరిగించాలి. వేడి నీటిలో తేనె కలపడం వల్ల విషపూరితం అవుతుంది. అందుకే కొద్దిగా చల్లబడిన తర్వాత వాటిని వడకట్టి అందులో తేనె కలుపుకోవచ్చు. చివరగా బాదం పప్పు పొడి వేసుకుని తాగాలి.
మొటిమలు లేని మెరిసే చర్మాన్ని ఇచ్చే అద్భుతమైన రెమిడీ ఇది. శరీరంలో కొవ్వు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు రోగనిరోధక వ్యవస్థని బలపరుస్తుంది. పీసీఓఎస్ సమస్య ఉన్న మహిళలు తరచూ ఈ నీళ్ళు తీసుకోవడం వల్ల పీరియడ్స్ క్రమంగా వస్తాయి.
నెయ్యి లేదా పాలతో కలిపి తీసుకున్నప్పుడు రక్తపోటుని తగ్గిస్తుంది. మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది. శక్తివంతమైన యాంటీ డిప్రెసెంట్‌గా పని చేస్తుంది. 6-8 వారాల పాటు ఈ నీటిని తాగడం వల్ల మొత్తం ఆరోగ్యం మంచిగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక- ఆరోగ్య నిపుణులు ఇచ్చిన సమాచారం, అధ్యయనాల ప్రకారమే మీకు ఈ సమాచారం అందించారు. మనలోకం సొంతగా రాసింది కాదని గమనించగలరు.