ఐపీఎల్ 2022 లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో విజయాన్ని నమోదు చేసింది. గుజరాత్ టైటాన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ 8 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ను చిత్తు చేసింది. దీంతో వరుస విజయాలతో జోరు మీద ఉన్న గుజరాత్ టైటాన్స్ కు బ్రేక్ పడింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్.. ఓపెనర్లు శుభరాంభాన్ని ఇచ్చారు. అభిషేక్ శర్మ (42), కేన్ విలియమ్సన్ (57) పరుగులతో రఫ్ ఆడించారు. వీరి తర్వాత రాహుల్ త్రిపాఠి (17) చేశాడు. అయితే ఈ మ్యాచ్ లో రాహుల్ త్రిపాఠికి గాయం కావడంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు.
నికోలస్ పూరన్ ( 18 బంతుల్లో 34 నాటౌట్ ), మార్క్రమ్ (12 నాటౌట్) చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. దీంతో మరో 5 బంతులు మిగిలి ఉండగానే.. లక్ష్యాన్ని చేరుకున్నారు. కాగ ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్.. హార్ధిక్ పాండ్యా (50 నాటౌట్), అభినవ్ మనోహర్ (35) రాణించారు.
సన్ రైజర్స్ బౌలర్స్.. నటరాజన్ మరో సారి 2 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అలాగే భూవనేశ్వర్ కూడా 2 వికెట్లు పడగొట్టాడు. ఉమ్రాన్ మాలిక్, జన్సన్ ఒక్కో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో అర్థ శతకం బాదిన కేన్ మామాకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.