Vijay: పదేళ్ల పాటు మీడియా ముందుకు రాని స్టార్ హీరో..ఎందుకో తెలుసా?

-

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ నటించిన ‘బీస్ట్’ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్న ఈ ఫిల్మ్ కు నెల్సన్ దర్శకత్వం వహించగా, విజయ్ కు జోడీగా టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటించింది. కాగా, ఈ సినిమాకు మొదటి సారి ప్రమోషనల్ ఇంటర్వ్యూ విజయ్ ఇచ్చారు. దాదాపు పదేళ్ల పాటు సినిమా ప్రమోషన్స్ చేయని విజయ్..తొలిసారి ఈ సినిమా కోసం నెల్సన్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆసక్తికర విషయాలు చెప్పారు.

తలపతి విజయ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అందరికీ విదితమే. ఒకానొక మీటింగ్ లో విజయ్ నెక్స్ట్ సూపర్ స్టార్ అని తమిళ్ తలైవా రజనీకాంత్ చెప్పారు. అయితే, విజయ్ తన సినిమ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనబోరు. కానీ, తొలిసారి ‘బీస్ట్’ కోసం ఇంటర్వ్యూ ఇచ్చారు. మీడియా సమావేశాల్లో పాల్గొనకుండానే తన చిత్రాలను విడుదల చేస్తారు. కేవలం సినిమా ఈవెంట్ లో మాట్లాడుతారు విజయ్. అలా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం వెనుక పెద్ద కారణం ఉందన్నారు ఇళయ తలపతి.

తాను పదేళ్ల కిందట ఓ ఇంటర్వ్యూలో మాట్లాడానని, అయితే, ఆ తదుపరి రోజు తాను మాట్లాడింది కాకుండా మరో విషయం పేపర్ లో వచ్చిందని, అది చూసి తాను ఆశ్చర్యపోయానన్నాడు. ఈ విషయమై తాను తన కుటుంబ సభ్యులకు వివరణ ఇచ్చానని, కానీ, ప్రజలకు మాత్రం ఇవ్వాలనుకోలేదన్నాడు. అలా అప్పటి నుంచి మీడియా ముందుకు రావడానికి ఇంట్రెస్ట్ చూపించలేదని పేర్కొన్నాడు.

ఒకవేళ వస్తే నిజాలు కాకుండా అబద్ధాలు ప్రసారంలోకి వస్తాయని అనుకున్నానన్నాడు. అయితే, పదేళ్ల తర్వాత తమ అభిమాన కథానాయకుడు ఇంటర్వ్యూ ఇవ్వడం పట్ల తలపతి విజయ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ‘బీస్ట్’ చిత్రానికి యంగ్ అండ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే ఈ పిక్చర్ నుంచి రిలీజ్ అయిన ‘అరబిక్ కుత్తు, ‘జాలియా జింఖానా’ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news