గందరగోళం: ఐపీఎల్ మ్యాచ్ ను ఆపేసిన ఫ్యాన్స్…

-

ఈ రోజు ఐపీఎల్ లో హైదరాబాద్ మరియు లక్నో జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ కాసేపు ఆగిపోయింది. హైదరాబాద్ జట్టుకు మద్దతు తెలుపుతున్న అభిమానులు లక్నో టీం మొత్తం కూర్చునే చోట నట్టులు మరియు బోల్టులు విసిరి వేశారు. ఈ పరిస్థితిని అస్సలు ఊహించని లక్నో టీం యాజమాన్యం షాక్ కు గురిచేసింది. దీనితో దాదాపు 10 నిముషాల పాటు మ్యాచ్ ను నిర్వాహకులు నిలిపివేశారు. ఇక అక్కడే ఉన్న గంభీర్ ను చూసిన అభిమానులు కోహ్లీ కోహ్లీ అంటూ నినాదాలు చేసారు. ఆ తర్వాత ఆ జట్టులో కొందరు ఈ జట్టులో కొందరు కలిసి మాట్లాడుకుని పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు.

దానితో మళ్ళీ మ్యాచ్ ను యధావిధిగా స్టార్ట్ చేశారు, గతంలో కూడా చాలా సార్లు అభిమానులు ప్లేయర్స్ పై బాటిళ్లు విసిరివేయడం లాంటి ఘటనలు జరిగాయి. కానీ నట్టులు మరియు బోల్టులు విసరడం మాత్రం ఇదే మొదటిసారి అని చెప్పాలి. కాగా ఈ మ్యాచ్ లో SRH లక్నో ముందు 183 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

Read more RELATED
Recommended to you

Latest news