రాగి ఆభరణాలు ధరించడం వల్ల ఎన్ని ప్రయోజనాలు తెలుసా..?

-

రాగి: బంగారం, డైమండ్‌ ఆభరణాలు వేసుకోవడం అంటే జనాలకు ఇష్టం.. ఇవి మీ అందాన్ని మరితం పెంచుతాయి అనుకుంటారు.. ఆభరణాలతో ఆరోగ్యాన్ని పెంచుకోవాలంటే.. మీరు రాగి ఆభరణాలు వేసుకోవాల్సిందే. రాగితో త‌యారు చేసే క‌డియాలు, ఉంగ‌రాలు.. ఇలా రాగితో త‌యారు చేసిన ఆభ‌ర‌ణాల‌ను ధ‌రిస్తే మీ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. రాగి ఆభరణాలు డైలీ వేసుకోవడం వల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

 

రాగితో త‌యారు చేసిన ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించ‌డం వ‌ల్ల వాటిలో ఉండే రాగి కొద్ది కొద్దిగా మ‌న శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంది. దీని వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చు.

రాగితో త‌యారైన ఆభ‌ర‌ణాల‌ను ధ‌రిస్తే మ‌న శ‌రీరంలో చేరే రాగి ఇత‌ర మిన‌ర‌ల్స్‌ను శోషించుకునేందుకు స‌హాయం చేస్తుంది. ముఖ్యంగా ఐర‌న్‌, జింక్ శ‌రీరానికి ల‌భిస్తాయి.

సైంటిస్టులు చెబుతున్న ప్ర‌కారం.. రాగిలో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాలు ఉంటాయి. అందువ‌ల్ల కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి.

మనం తినే ఆహారాలు, తాగే ద్ర‌వాల వ‌ల్ల ర‌క్త నాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. దాన్ని తొల‌గించేందుకు రాగి ఉప‌యోగ‌ప‌డుతుంది. అందువ‌ల్ల రాగితో త‌యారు చేసిన ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించాలి.

రాగిలో యాంటీ ఏజింగ్ ల‌క్ష‌ణాలు ఉంటాయి. అందువ‌ల్ల వృద్ధాప్య ఛాయ‌లు అంత త్వ‌ర‌గా రావు. చ‌ర్మంపై ఉండే ముడ‌త‌లు, మ‌చ్చ‌లు పోతాయి.

డ‌యాబెటిస్‌తో బాధ‌ప‌డుతున్న‌వారు, నెల‌స‌రి స‌మ‌స్య‌లు ఉన్న మ‌హిళ‌లు రాగి ఆభ‌ర‌ణాల‌ను ధ‌రిస్తే మంచిది.

రాగి ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించ‌డం వ‌ల్ల ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. ర‌క్త‌హీన‌త నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

ఉంగరపు వేలుకు ధరించే రాగి ఉంగరంతో మంచి జరుగుతుందని చెబుతారు. పురుషులు కుడిచేతి ఉంగరపు వేలికి, స్త్రీలు ఎడమచేతి ఉంగరపు వేలికి ధరిస్తే మంచిదని అంటారు. రాగి(Copper) లోహం మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మన శరీరంలో శక్తిని పెంచుతుంది. రాగి లోహాన్ని ఉంగరంగా ధరించడం వల్ల రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు శరీరంలో రక్త ప్రసరణకు ఎంతో మేలు జరుగుతుంది. ఇది వ్యాధి నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. శరీరంలోని మలినాలను తొలగించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రాగి ఉంగరం ధరించడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. రాగి ఉంగరం శరీరంలోని రక్తపోటును సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది గుండె సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news