చివరి మ్యాచ్ లో నెదర్లాండ్ ను చిత్తు చేసిన శ్రీలంక

-

ప్రపంచ కప్ లో ఇప్పటికే శ్రీలంక,  పాకిస్తాన్, న్యూజిలాండ్ వంటి జట్లు ఇంటి ముఖం పట్టిన విషయం తెలిసిందే. అయితే  సోమవారం జరిగిన చివరి మ్యాచ్ లో 83 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ ను శ్రీలంక చిత్తుగా ఓడించింది. టీ20 ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్-డీ లోని శ్రీలంక, నెదర్లాండ్ జట్లు  దేశాలు తలపడ్డాయి. సెయింట్ లూసియానా వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులలతో నెదర్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇందులో కౌశల్ మెండిస్, అసలంక చెరో 46 స్కోర్ చేసి ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన నెదర్లాండ్ మొదటి నుండే పేలవ ప్రదర్శన చేస్తూ వచ్చింది.

118 పరుగుల వద్ద 16.4 ఓవర్లకే ఆలౌట్ గా నిలిచింది. నెదర్లాండ్ బ్యాటర్లలో మిచెల్ లెవిట్, స్కాట్ ఎడ్వర్డ్ లు చెరో 31 పరుగులతో రాణించగా.. మిగిలిన వారెవ్వరు ఆశింనంతగా ఆడలేకపోయారు. ఇక ఈ గ్రూప్-డీ లో ఇప్పటికే వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలిచిన సౌతాఫ్రికా సూపర్-8 కు చేరుకుంది. సోమవారం 5 గంటలకు జరిగిన మ్యాచ్ లో నేపాల్ పై గెలుపుతో బంగ్లాదేశ్ సూపర్-8 కు చేరుకోవడంతో నేపాల్, నెదర్లాండ్, శ్రీలంక లు ఇంటి బాట పట్టాయి.

Read more RELATED
Recommended to you

Latest news