బక్రీద్ పండుగపూట మెదక్ జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. గుండెపోటుతో గంటల వ్యవధిలోనే అత్తా, అల్లుడు మృతి చెందారు. ఈ ఘటన చేగుంట మండలం మక్కరాజుపేటలో సోమవారం ఉదయం జరిగింది. ఆదివారం రాత్రి గుండెపోటుతో అల్లుడు నరసింహులు (58) మృతిచెందగా.. అల్లుడి మరణవార్త విని తట్టుకోలేక గుండెపోటుతో అత్త నర్సవ్వ సోమవారం ఉదయం కన్నుమూశారు. గంటల వ్యవధిలో ఒకే కుటుంబంలో ఇద్దరు మృతిచెందడంతో ఆ విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులంతా కన్నీరుమున్నీరుగా కుటుంబంలో విలపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ మధ్య కాలంలో గుండెకు సంబంధించిన వ్యాధులతో అనేకమంది బాధపడుతున్నారు. గుండెపోటు, గుండె వైఫల్యం వంటి సమస్యలు ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తాయో చెప్పడం చాలా కష్టం. వయసుతో సంబంధం లేకుండా 20 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు అందరికీ గుండెపోటు వస్తోంది. కాబట్టి గుండె రక్షణ కోసం ప్రతిరోజూ ప్రత్యేకమైన ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండెకు రక్షణ కల్పించే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.