బాలయ్యకి కూతురు పాత్రలో శ్రీలీల

-

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 108వ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉందన్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాకి దర్శకత్వం అనిల్ రవిపూడి వహిస్తున్నాడు. ఈ సినిమాలో తన మార్కు కామెడీ కంటే, బాలయ్య తరహా యాక్షన్ ఎక్కువగా ఉంటుందని ఇంతకు ముందే అనిల్ రావిపూడి తెలిపారు. ఇందులో ప్రధానంగా తండ్రీ కూతుళ్ల ఎమోషన్స్ ఉంటాయనీ, బాలయ్యకి కూతురు పాత్రలో శ్రీలీల నటించంచబోతుంది అని అనిల్ రావిపూడి తెలిపారు. అయితే, ప్రస్తుతం మాత్రం ఈ సినిమా షూటింగు హైదరాబాదులో జరుగుతోంది.

Balakrishna 108 Movie Update

ఈ సినిమా షూటింగులో తాజాగా శ్రీలీల జాయిన్ అయింది. ఈ సందర్భంగా ఆమెకి వెల్కమ్ చెప్పింది ఈ సినిమా టీమ్. ఈ సినిమాలో బాలయ్య సరసన కథానాయికగా ఎవరు నటిస్తారనే విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ‘అఖండ’ .. ‘వీరసింహా రెడ్డి’ సినిమాలను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో తమన్ నిలబెట్టిన కారణంగా, సహాజంగానే ఈ సినిమాపై అంచనాలు చాలా పెద్దగా ఉన్నాయి. అనిల్ రవిపూడి దర్శకత్వం లో బాలయ్య నటించడం ఇదే మొదటిసారి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news