ముగిసిన తెలంగాణ క్యాబినెట్ సమావేశం

-

నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ క్యాబినెట్ సమావేశం కొద్దీ సేపటి క్రితమే ముగిసింది. పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిపై మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… రాష్ట్రంలో 1.30 లక్షల కుటుంబాలకు దళితబంధు ఇవ్వనున్నామని వెల్లడించారు. ఇప్పటికే తొలి విడత అమలు చేశామని, త్వరలోనే రెండు విడత చేపడతామని అన్నారు. గృహలక్ష్మి పథకం ద్వారా 4 లక్షల మంది పేదలకు ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. నియోజకవర్గానికి 3 వేల చొప్పున ఇళ్లు కేటాయించడం జరుగుతుందని చెప్పారు.

Cabinet meet on March 9 to review salaries, pension

లబ్దిదారుడికి రూ.3 లక్షల గ్రాంట్ ఇస్తామని హరీశ్ రావు పేర్కొన్నారు. లబ్దిదారుల ఎంపిక వెంటనే చేపట్టాలని క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించినట్టు వివరించారు.డబుల్ బెడ్రూం ఇళ్లు, పోడు భూముల పట్టాల అంశంపైనా క్యాబినెట్ లో విపులంగా చర్చించినట్టు హరీశ్ రావు తెలిపారు. ఏప్రిల్ 14న దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం చేయనున్నట్టు ఆయన వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news