500 ఏళ్ల తర్వాత జన్మస్థలంలో శ్రీరామ నవమి ఉత్సవాలు

-

అయోధ్యలో నిర్మితమైన రామమందిరంలో తొలిసారి శ్రీరామ నవమి ఉత్సవాలు జరగనున్నాయి. అయితే, సుమారు 500 సంవత్సరాల తర్వాత ఆయన జన్మస్థలమైన అయోధ్యలో ఈ ఏడాది రామనవమి వేడుకలు నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 17న మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు రామ్లల్లా నుదుటిపై 75 MM వ్యాసార్థంలో వృత్తాకార తిలకంలా 4 నిమిషాల పాటు ప్రకాశించనున్నాయి.

కాగా, జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరు అయినారు. అంతే కాకుండా ఈ కార్యక్రమానికి దేశములోని సినీ, రాజకీయ ప్రముఖులే కాకుండా అంతర్జాతీయ ప్రముఖులు కూడా హాజరు అయిన విషయం తెలిసిందే. ఇక బాల రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగినప్పటి నుంచి దేశ నలుమూలల నుంచి శ్రీరాముని ని చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news