శ్రీ సత్య ఎలిమినేట్ ! నెటిజన్స్ షాకింగ్ కామెంట్స్.!

-

21 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన తెలుగు బిగ్ బాస్ సీజన్ ఆరుగురు కంటెస్టెంట్లకు చేరుకుంది. మిగతా సీజన్‌ల కంటే ఈ సీజన్ చప్పగా సాగుతుందనే రూమర్ ఉంది. అయినా కూడా గొడవలు పడే వారిని చూసే మనస్తత్వం కలిగిన వారికి ఇది బాగానే నచ్చుతుందిప్రస్తుతం హౌస్ లో ఆరుగురు ఉండగా ఈ వారం మధ్యలో ఒకరు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు.

హౌస్‌లో  ఒకరు ఈ వారం మధ్యలోనే ఎలిమినేట్ అవుతారని గత ఆదివారం నాగార్జున చెప్పారు. నాగ్ చెప్పినట్టే ఈ వారం హౌస్ నుంచి శ్రీ సత్య ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. అయితే అందరు కీర్తి హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు కానీ ఊహించని విధంగా శ్రీ సత్య ఎలిమినేట్ అయ్యింది.ప్రేక్షకులు వేసిన ఓట్ల ఆధారంగా శ్రీ సత్యను ఎలిమినేట్ చేసినట్టు బిగ్ బాస్ ప్రకటించాడు. అంతకు ముందు.. హౌస్ మేట్స్ ను ఎవరు ఎలిమినేట్ అవ్వాలని అనుకుంటున్నారో చెప్పాలని బిగ్ బాస్ ఆదేశించాడు.

హౌస్ లో చాలా మంది కీర్తి పేరు చెప్పగా.. అందరూ కూడా ఆమే ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు.. కానీ ఊహించని విధంగా శ్రీసత్య ఎలిమినేట్ అయ్యింది. శ్రీ సత్య ఎలిమినేట్ అని బిగ్ బాస్ అనౌన్స్ చేయడంతో రేవంత్ ఏడ్చాడు. కాని నెటిజన్స్ మాత్రం ఎప్పుడో వెళ్లి పోవాల్సిన శ్రీ సత్య ను ఇప్పటిదాకా బిగ్ బాస్ తీసుకొని వచ్చాడు అని కామెంట్స్ పెడుతున్నారు. ఆమె కంటే స్ట్రాంగ్ అయిన సూర్య, ఇనాయ, గీతు వంటి వారు ముందే ఎలిమినేట్ అయ్యారని ఈమె ఇప్పటిదాక ఉండడం గొప్ప అని అంటున్నారు

Read more RELATED
Recommended to you

Latest news