బిగ్‌బాష్‌ లీగ్‌లో చెత్త రికార్డు.. 15 పరుగులకే ఆలౌట్

-

ప్రతిష్టాత్మకమైన బిగ్ బాష్ టి20 లీగ్ లో సిడ్నీ థండర్స్ అత్యంత చెత్త రికార్డును నమోదు చేసింది. శుక్రవారం ఆడి లైట్ స్ట్రైకర్స్ తో జరిగిన మ్యాచ్ లో సిడ్ని 15 పరుగులకే ఆల్ అవుట్ అయింది. టీ20 ఫార్మాట్ లో ఇదే అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. తోలుత బ్యాటింగ్ చేసిన ఆడి లైడ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.

క్రిస్ లీన్ (36), గ్రాండోమ్ (33) మాత్రమే కాస్త రాణించారు. తర్వాత స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన సిడ్నీ థాండర్స్ ను ప్రత్యర్థి జట్టు బౌలర్లు 15 పరుగులకే కుప్పకూల్చారు. పేలవమైన బ్యాటింగ్ ను కనబరిచిన సిడ్నీ థండర్స్ 5.5 ఓవర్లలోనే చాప చుట్టేసింది. ఐదుగురు బ్యాటర్లు ఖాతా తెరవకుండానే పెవీలియన్ చేరారు. ఆడిలైడ్ బౌలర్లలో థాంప్టన్ 3 పరుగులకే 5 వికెట్లు పడగొట్టాడు. వెస్ అగర్ కు నాలుగు వికెట్లు దక్కాయి.

Read more RELATED
Recommended to you

Latest news