ట్రెండ్ మార్చిన సిక్కోలు తెలుగు తమ్ముళ్లు…!

-

సిక్కోలులో అధికారపార్టీకి తెలుగు తమ్ముళ్లు విసురుతున్న సవాళ్లు రాజకీయాన్ని హీటెక్కిస్తున్నాయా అంటే అవుననే సమాధానమే పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తుంది.ఒక టైంలో వైసీపీ పవర్‌లోకి వచ్చిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ దూకుడికి బ్రేకులు పడ్డాయి. టెక్కలి, ఇచ్ఛాపురంలో టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచినా మునుపటి ఊపు కనిపించ లేదు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో టీడీపీ నేతలు మౌనంగా ఉండిపోయారు. ఎమ్మెల్యే అయినప్పటికీ బెందాళం అశోక్‌ను ఇచ్ఛాపురంలో ఎవరూ పట్టించుకోవడం లేదు.

ఎవరైనా గట్టిగా నోరెత్తితే పోలీస్‌ కేసు పెట్టే పరిస్థితి ఉంది. జిల్లా అగ్రనేత అచ్చెన్నాయుడు, కూన రవిలు కేసుల్లో ఇరుక్కుని ఇబ్బంది పడ్డారు.ఇలాంటి తరుణంలో పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షులను ప్రకటించారు చంద్రబాబు. శ్రీకాకుళానికి కూన రవికుమార్‌ను అధ్యక్షుడిని చేశారు. ఆయనకు అలా బాధ్యతలు అప్పగించారో లేదో ఇలా రంగంలోకి దిగిపోయారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ టీడీపీ అధినేత చంద్రబాబుపై చేసిన కామెంట్స్‌ను నిరసిస్తూ ఓ రేంజ్‌లో ఆందోళన చేపట్టి పార్టీ నేతల్లో జోష్‌ తీసుకొచ్చారనే కామెంట్స్‌ వినిపించాయి. జిల్లాలోని టీడీపీ నేతలను కలుపుకొని వెళ్లడం ప్లస్‌ అయిందని టాక్‌.

ఇప్పుడు జిల్లాకే చెందిన అచ్చెన్నాయుడికే రాష్ట్ర టీడీపీ అధ్యక్ష పదవి ఇవ్వడంతో సిక్కోలు తమ్ముళ్లలో ఎక్కడ లేని ఉత్సాహం కనిపిస్తోందట. ఇక కాచుకోండి అని అధికార పార్టీ నేతలకు తొడగొట్టి సవాల్‌ విసురుతున్నారట. అలాగే ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నట్టుగా జిల్లాపై అచ్చెన్న ఫోకస్‌ పెట్టడం కేడర్‌లో మరింత జోష్‌ తీసుకొచ్చిందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news