ఇండియాతో ఫైనల్ కు ముందు శ్రీలంక “కీ ప్లేయర్” కు గాయం !

-

నిన్న ఆసియా కప్ లో సెమి ఫైనల్ లాంటి మ్యాచ్ శ్రీలంక మరియు పాకిస్తాన్ ల మధ్యన జరిగింది. ఇందులో శ్రీలంక ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరం అయిన దశలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మన్ చరిత్ అసలంక నెమ్మదిగా బంతిని స్క్వేర్ లెగ్ లోకి పంపడం ద్వారా రెండు పరుగులు సాధించి శ్రీలంక ను ఫైనల్ కు చేర్చాడు. కాగా ఈ మ్యాచ్ లో శ్రీలంక కీలక స్పిన్నర్ గా ఉన్న మహేష్ తీక్షణ తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం అతన్ని స్కానింగ్ కోసం పంపించగా పూర్తి స్థాయి రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉండగా, ఇది నిజంగా శ్రీలంకకు షాక్ అని చెప్పాలి. ఇండియా తో ఫైనల్ మ్యాచ్ కు ముందు కీలక ప్లేయర్ గాయపడడం చాలా దెబ్బ. మరి ఈ గాయం చిన్నదేనా లేదా కొన్ని రోజులు విశ్రాంతి అవసరమా అన్న పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

కాగా ఇండియా మరియు శ్రీలంక ల మధ్యన ఫైనల్ మ్యాచ్ ఆదివారం రోజున కొలంబో వేదికగా జరగనుంది. ఇక ఈ రోజు ఇండియా మరియు బంగ్లాదేశ్ ల మధ్యన నామమాత్రమైన మ్యాచ్ జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...