శ్రీలంక మరియు ఆస్ట్రేలియా మధ్యన జరుగుతున్న కీలక మ్యాచ్ లో ఎకపక్షముగా మ్యాచ్ ముగియనున్నట్లు మార్పులు కనిపిస్తున్నాయి, ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక మొదటి 20 ఓవర్లలోనే ఆకట్టుకోగలిగింది. మిగిలిన ఆట అంతా ఆస్ట్రేలియా బౌలర్లు ఆడించారు. శ్రీలంక మొదటి వికెట్ కు 125 పరుగులు చేయగా చివరికి తొమ్మిది వికెట్లు కలిసి చేసిన పరుగులు 84 మాత్రమే. జట్టులో మెండిస్, ధనుంజయ, సమరవిక్రమ, అసలంక, కరుణరత్నే లు ఉన్నా కూడా చాలా దారుణమైన ఆటతీరును కనబరిచింది. కేవలం నిస్సంక మరియు పెరెరాలు మాత్రమే అర్ద సెంచరీ లు చేసి కాస్త జట్టు పరువును కాపాడారు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లు ఎన్నడూ లేని విధంగా అద్భుతంగా రాణించి శ్రీలనకకు కళ్లెం వేశారు. ముఖ్యంగా లెగ్ స్పిన్నర్ ఆడం జంపా నాలుగు వికెట్ లతో చెలరేగి శ్రీలంక పతనాన్ని శాసించింది.
ఇతనికి స్టార్క్ 2, కమిన్స్ 2 వికెట్ లు తీసి చక్కగా సహకరించారు. మరి ఆస్ట్రేలియా ముందున్న 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఆస్ట్రేలియా వరల్డ్ కప్ లో మొదటి విజయాన్ని నమోదు చేసుకుంటుందా అన్నది తెలియాల్సి ఉంది.