గత సంవత్సరం నవంబర్ లో శ్రీలంక స్టార్ క్రికెటర్ దనుష్క గుణతిలక ఆస్ట్రేలియా లోని సిడ్నీ కి చెందిన సంవత్సరాల యువతిని లైంగికంగా వేధించాడని ఫిర్యాదు ఇవ్వడంతో సిడ్నీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుండి గుణతిలక కోర్ట్ లలో కేసు గెలవడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ వచ్చాడు. అక్కడే తనకు అనుకూలంగా ఒక లాయర్ ను పెట్టుకుని కేసును ముందుకు తీసుకువెళ్లాడు. తాజాగా దనుష్క గుణతిలక కు అనుకూలంగా ఆస్ట్రేలియా కోర్ట్ తీర్పు ఇచ్చింది. ఇతనిపై ఉన్న హత్యాచారం వేధింపులకు సంబంధించిన ఆరోపణలను కొట్టివేస్తూ ఇతన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. ఈమెను కోర్ట్ విచారిస్తున్న సమయంలో రెండు రకాలుగా వాదనలు చెప్పడంతో కోర్ట్ తీర్పును గుణతిలకకు అనుకూలంగా ఇచ్చింది.
దీనితో దనుష్క గుణతిలకకు పెద్ద తలనొప్పి పోయిందని చెప్పాలి, కానీ ఇతనికి మళ్ళీ క్రికెట్ లో ఆడే ఛాన్స్ దక్కుతుందా అన్నది ఇక భవిష్యత్తే నిర్ణయిస్తుంది.