శ్రీలంక సంచలన నిర్ణయం.. బురఖా ధరించడంపై నిషేధం..

-

శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆ దేశంలో బురఖాను ధరించడాన్ని నిషేధించనున్నారు. ఈ మేరకు అక్కడి ఇస్లామిక్‌ పాఠశాలలు, మదరసాలలో ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నారు. ఈ సందర్భంగా శ్రీలంక పబ్లిక్‌ సేఫ్టీ మినిస్టర్‌ శరత్‌ వీరశేఖర మీడియాతో మాట్లాడుతూ బురఖాను ధరించడాన్ని నిషేధించనున్నట్లు తెలిపారు. దీని వల్ల దేశంలో భద్రత మెరుగవుతుందని తెలిపారు.

srilanka government decided to ban on burakha

బురఖా ధరించడం వల్ల ఒక మనిషి ముఖం కనిపించదు. ఇది తీవ్రవాద సంఘటనలను ప్రేరేపిస్తుంది. అని మంత్రి అన్నారు. ఈ మేరకు బురఖా ధరించడాన్ని నిషేధించే ప్రతిపాదనలపై ఆయన సంతకం చేశారు. దాని కేబినెట్‌ అనుమతి కోసం పంపించిట్లు తెలిపారు.

కాగా ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌ దేశాల్లో ఇప్పటికే బురఖాను ధరించడాన్ని నిషేధించారు. ఈ క్రమంలో శ్రీలంక కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. అయితే గతంలోనూ ఒకసారి శ్రీలంక ప్రభుత్వం బురఖాను ధరించడాన్ని నిషేధించింది. అప్పట్లో 2019వ సంవత్సరంలో బౌద్ధ ప్రార్థనా మందిరాలపై తీవ్ర వాదులు దాడులు జరిపి 250 మందిని బలి తీసుకున్నారు. దీంతో అప్పట్లో తాత్కాలికంగా బురఖాపై నిషేధం విధించారు. కానీ ఇకపై దాన్ని శాశ్వతం చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news