శ్రీలంక క్రికెట్ టీం లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీలంక టెస్ట్ జట్టుకు మొదటి కెప్టెన్ గా వ్యవహరించిన బద్దుల వర్ణపురా మరణించారు. 68 సంవత్సరాలు ఉన్న బద్దుల వర్ణ పుర సోమవారం ఉదయం పూట అనారోగ్యంతో మృతి చెందారు. షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోవడం కారణంగా బద్దుల వర్ణపూర మృతి చెందినట్లు శ్రీలంక మీడియా పేర్కొంది.
1982 సంవత్సరం ఫిబ్రవరి లో కొలంబో వేదికగా ఇంగ్లాండ్ జట్టు శ్రీలంక ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్ కు కెప్టెన్ గా వ్యవహరించిన వర్ణపూర… శ్రీలంక తరఫున తొలి బంతిని ఎదుర్కొన్న బ్యాట్స్మెన్ గా, తొలి పరుగులు చేసిన ఆటగాడిగా… అలాగే ఓపెనింగ్ బ్యాటింగ్ మరియు ఓపెనింగ్ బౌలింగ్ చేసిన మొట్టమొదటి ఆటగాడిగా పలు రికార్డులను తన వశం చేసుకున్నాడు బద్దుల వర్ణపుర.
తన క్రికెట్ కిరణ్ మొత్తం లో నాలుగు టెస్టులు మరియు 12 వన్డేలు ఆడిన బద్దుల వర్ణ పుర… 1975 సంవత్సరం లో జరిగిన ప్రపంచకప్ ద్వారా వన్డే ఆరంగేట్రం చేశాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం కూడా బత్తుల వర్ణ పుర శ్రీలంక కోచ్ గా పనిచేశారు. కాగా బద్దుల వర్ణపుర మృతి పట్ల శ్రీలంక టీం క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు.