జగన్ సంచలన నిర్ణయం : కరోనాతో కుటుంబాలకు కారుణ్య నియామకాలు

-

చైనాలో పురుడుపోసుకున్న కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కరోనా మహమ్మారి పేద, ధనిక అనే తేడా లేకుండా అందరినీ కలిచివేసింది. మామూలు పేద ప్రజల నుంచి… రాజకీయ నాయకుల వరకు అందరూ ఈ కరోనా బారిన పడి మృతి చెందారు. మృతి చెందిన వారిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉండడం గమనార్హం.

అయితే కరోనా బారినపడి మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగాల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీపికబురు చెప్పారు. కరోనా కారణంగా మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలలోని వారికి కారుణ్య నియామకాలు ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదముద్ర వేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య రంగం పై సమీక్ష చేపట్టిన ముఖ్యమంత్రి జగన్.. వైద్యా రోగ్య రంగంలో నాడు నేడు, కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు పనుల పురోగతి వంటి అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా కారణంగా మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. ఈ కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు వారి కుటుంబాల వారికి కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. వచ్చే నెలాఖరులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news