గతంలో స్టార్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ పెంచాలి అంటే కాస్త ఆలోచించేవారు. కానీ ఈ మధ్యకాలంలో హీరోయిన్లు సైతం పెంచడం విషయంలో ఎలాంటి విషయాలను ఆలోచించకుండా పెంచేస్తూ ఉన్నారు. కేవలం ఒక్క సినిమా సక్సెస్ అయితే చాలు అమాంతం వారి పారితోషకాన్ని డబుల్ చేస్తూ ఉంటారు. అలాంటి లిస్టులో ముందు వరుస ఉన్న హీరోయిన్లలో శ్రీ లీల కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లి సందD సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో ఈమె అందచందాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి కానీ ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదని టాక్ ఇండస్ట్రీలో ఉంది.
కొన్ని నెలల క్రితం వరకు ఈ ముద్దుగుమ్మ కేవలం లక్షలలో పారితోషకం తీసుకుంటూ ఉండేది. ఇక అలాగే రవితేజ సరసన ఒక సినిమాలో నటించడంతో ప్రస్తుతం ఇమే కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ యువ హీరోయిన్ పలు క్రేజీ ప్రాజెక్టులలో హీరోయిన్గా నటిస్తూ ఉన్నది. రవితేజ తో నటించిన ధమాకా చిత్రం సక్సెస్ అయ్యిందంటే చాలు స్టార్ హీరోయిన్ల జాబితాలోకి చేరిపోతుందని ఈమె అభిమానుల సైతం భావిస్తున్నారు. ఉప్పెన సినిమా హీరోయిన్ కృతి శెట్టి కూడా మొదట వరుస విజయాలతో అందుకున్న తర్వాత వరుస ప్లాపులను చవిచూసింది.
దీంతో శ్రీలీల రేంజ్ అమాంతం పెరిగిపోయిందని చెప్పవచ్చు. దీంతో రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఈ ముద్దుగుమ్మ పెంచేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కొంతమంది మాత్రం ఇలా పెంచడం కరెక్ట్ కాదని భావిస్తూ ఉన్నారు. శ్రీ లీల కెరియర్ విషయంలో మరింత ఎదగాల్సి ఉందని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. కథలు ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేస్తోందని చెప్పవచ్చు. మరి శ్రీలీల కెరియర్ ఎలా ఉంటుందో చూడాలి.