శ్రీముఖి.. మరీ ఇంతలా హద్దు మీరాలా..వీడియో వైరల్..!

-

బుల్లితెరపై రాములమ్మగా గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పటాస్ షో ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన ఈమె పలు షోలకు హోస్టుగా వ్యవహరిస్తూ మరింత పాపులారిటీని సంపాదించుకుంది. అంతే కాదు వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించి అక్కడ కూడా మంచి ఇమేజ్ ను సొంతం చేసుకోవడమే కాకుండా పలు గ్లామర్ ఫోటోలకు ఫోజులిస్తూ మరింత రెచ్చిపోతూ ఉంటుంది. ఇకపోతే ఈ క్రమంలోని తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని జబర్దస్త్ కమెడియన్ అవినాష్ తో ఈమె చేసే సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే.

ఇక వీరిద్దరూ ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ అనే తేడా లేకుండా ఎప్పుడూ ఒకే రకంగా ఉంటూ దుమ్ము లేపుతూ ఉంటారు. అంతేకాదు వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ముఖ్యంగా కష్టకాలంలో ఉన్న అవినాష్ ను శ్రీముఖి ఆదుకుంది ..అంతేకాదు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడానికి అవినాష్ మల్లెమాల అగ్రిమెంట్ ప్రకారం రూ.10 లక్షలు చెల్లించడంలో శ్రీముఖి కూడా సహాయం చేసింది. ఇక అవినాష్ పెళ్లిలో కూడా శ్రీముఖి సందడి ఏ రేంజ్ లో ఉందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే . ముఖ్యంగా అవినాష్ పెళ్లి లో శ్రీముఖి ముందుండి మరీ అన్ని పనులను చేస్తూ అందర్నీ నవ్విస్తూ హడావిడి చేసింది. అవినాష్ కూడా అప్పుడప్పుడు శ్రీముఖి సహాయం వల్లే నేను ఈ రోజుల్లో ఇక్కడ ఉన్నాను అంటే తరచుగా చెబుతూ ఉంటాడు .

ఇక ఇది ఇలా ఉండగా తాజాగా అవినాష్ తో శ్రీముఖి కలసి రీల్ వీడియో చేసింది . ఆ వీడియోలో చింపిరి జుట్టు ఆ పాటకు అవినాష్ , శ్రీముఖి ఇద్దరు కలిసి స్టెప్పులు ఇరగదీశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా వీడియోని పోస్ట్ చేసిన శ్రీముఖి కింద.. బైకు తీసుకురా మావ అనే క్యాప్షన్ ని కూడా జోడించింది .. దీన్ని చూసి కొంత మంది నెటిజన్స్ మరీ ఇంతలా హద్దు మీరాలా అంటూ ఈమపై కామెంట్స్ కూడా చేస్తున్నారు.

https://www.instagram.com/reel/CgxeVFzpdH5/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news