జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదులు మరో సారి రెచ్చిపోయారు. శ్రీనగర్ లోని ఎస్ కే ఐ ఎంఎస్ ఆసుపత్రిలోకి చొరబడ్డారు. సిబ్బందిని బందీలుగా చేసుకుని కాల్పుల జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆర్మీ ఆసుపత్రిని చుట్టుముట్టింది. బందీలను అడ్డు పెట్టుకుని ఆర్మీ బలగాాలపైకి కాల్పులు జరుపుతున్నారు. ముష్కరులు ప్రజలని అడ్డం పెట్టుకుని పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం శ్రీనగర్ లోని బెమినా రిజీయన్ లో ఉన్న ఆసుపత్రిలో ఈసంఘటన జరిగింది. కాగా పోలీసులు, ఆర్మీ సిబ్బంది ఆసుపత్రిని చుట్టు ముట్టడంతో పాటు సమీపం ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
బ్రెకింగ్: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దుశ్చర్య… ఆస్పత్రిలోకి చొరబడ్డ ఉగ్రవాదుల
-