ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కుప్పంలో 14వ వార్డు టీడీపీ అభ్యర్ధి పై వైసీపీ దాడి చేసిందని లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. దాడికి సంబంధించిన ఫొటోలను లేఖకు జతచేశారు చంద్రబాబు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని.. 14వ వార్డు టీడీపీ ఎస్సీ అభ్యర్థి వెంకటేశ్‌పై వైసీపీ నేతలు దాడి చేశారని ఫైర్ అయ్యారు చంద్రబాబు.
నామినేషన్ దాఖలు చేసే కేంద్రం వద్దే టీడీపీ అభ్యర్థిపై దాడి జరిగిందన్నారు. మధ్యాహ్నం జరిగిన దాడిలో వెంకటేశ్ తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. దాదాపు 30 మంది వరకు దాడిలో పాల్గొని వెంకటేశ్‌ను కొట్టారని.. వెంకటేశ్‌పై దాడిచేయడమే కాకుండా నామినేషన్ పత్రాలు చించేశారని నిప్పులు చెరిగారు. వెంకటేశ్ సెల్‌ఫోన్ లాక్కొని వెళ్లడంతో పాటు తీవ్రంగా కొట్టారని లేఖలో పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ముప్పు పొంచి ఉన్న అభ్యర్థులకు భద్రత కల్పించాలని.. తక్షణమే కుప్పం ఉప ఎన్నికల్లో దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్ వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.