Pushpa : దుమ్ము లేపుతున్న శ్రీవల్లి సాంగ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు డైరెక్టర్ సుకుమార్ ల కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు విభాగాలుగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలి భాగం డిసెంబర్ 17 వ తేదీన విడుదల కానుండగా… ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తీస్తున్నారు మేకర్స్.

ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాలో రష్మిక మందన కు సంబంధించి ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది. అయితే తాజాగా… పుష్ప నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది.

పుష్ప సినిమా నుంచి శ్రీవల్లి ఫుల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్రబృందం. ” చూపి బంగారమాయేనా శ్రీవల్లి… మాటే మాణిక్యమాయేనే… చూపే బంగారం అయ్యే నే శ్రీవల్లి… నవ్వే నవరత్న మాయే” అంటూ చంద్రబోస్ రాసిన రిలిక్స్ అందరినీ అలరిస్తున్నాయి. ఈ పాటను సిద్ది శ్రీరామ్ పాడారు. ఇక తాజాగా అప్డేట్ తో ఈ సినిమా పై మరిన్ని అంచనాలు పెరిగాయి.