Naga Chaitanya: మ‌రో ఇంటివాడు కాబోతున్న చైతూ.. అస‌లు విష‌యం తెలిస్తే షాక్‌!

Naga Chaitanya: టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు సమంత, నాగచైతన్య ల జంట. ఏమాయ చేశావే సినిమాతో ఇరువురు మ‌ధ్య స్నేహం, ఆ తరువాత‌ ప్రేమ, పెళ్ళి. ఇలా దాదాపు ఏడేండ్లు క‌లిసి జీవించారు. కానీ, ఏమైందో తెలియ‌దు. ఒక్కసారిగా వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టింది ఈ జంట‌. ఈ నిర్ణయంతో ఇండ‌స్ట్రీ ఒక్కసారిగా షాక్ అయ్యింది. సెలెబ్రిటీలు సైతం ఈ నిర్ణయానికి బాధపడ్డారు. ఇక సమంత తన విడాకులు జరిగినప్పటి నుండి తన ఇన్ స్టా అకౌంట్ లో ఏదొక పోస్ట్ పెడుతూ తన బాధను వ్యక్తం చేస్తుంది.


సమంత నాగచైతన్య ఇద్దరు కూడా ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా సంతోషంగానే విడిపోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విడాకుల ప్ర‌క‌ట‌న చేసినప్ప‌టి నుంచి సమంత తన ఇన్ స్టా అకౌంట్ లో ఏదొక పోస్ట్ పెడుతూ తన బాధను వ్యక్తం చేస్తుంది. కానీ నాగ చైత‌న్య మాత్రం సోష‌ల్ మీడియాలో సైలెంట్ గా ఉన్నారు. ఒంట‌రిగా ఉంటున్నట్టు తెలుస్తుంది. ఈ త‌రుణంలో నాగచైతన్య ఓ ఇంటివాడు కాబోతున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అసలు విషయానికి వస్తే.. దాదాపు రెండు నెల‌ల నుంచి నాగచైతన్య ఒంటరిగానే ఉంటున్నారు. పెండ్లి త‌రువాత కొనుగోలు చేసిన ఫ్లాట్ ను సైతం ఉండ‌టం లేద‌ట‌. త‌న స‌హ్నితుల ద‌గ్గ‌ర ఉంటునట్టు తెలుస్తుంది.

ఈ త‌రుణంలో తాజాగా జూబ్లిహిల్స్ లో ఓ కాస్ట్లీ బంగ్లాను కొన్నారని.. ప్రస్తుతం ఆ ఇంటికి పునరుద్దరణ పనులు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఆ పనులు పూర్తయ్యాక చైతన్య తన సొంత ఇంటికి షిఫ్ట్ అవుతారని తెలుస్తుంది. మ‌రో వైపు.. సమంతతో కలిసి ఉండాలని ఈ ఇంటి కొనుగోలు చేశాడ‌ని ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజం ఎంత ఉందనేది తెలియల్సి ఉంది.