SRK పఠాన్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్..!

-

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తాజాగా నటిస్తున్న చిత్రం పఠాన్. ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి పాట ఏ స్థాయిలో వివాదాలను సృష్టించిందో ప్రతి ఒక్కరికి తెలిసినదే. ఈ సినిమా నుంచి విడుదలైన బేషరం పాటలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే కాషాయపురంగు బికినీ ధరించడంతో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. ఇండియన్ ఫిలిమ్స్ లో హీరోయిన్స్ ఇలా నేరుగా బికినీలలో దర్శనం ఇవ్వడం ఏంటి ? అంటూ ఒకవైపు కామెంట్లు వినిపిస్తూనే.. మరొకవైపు హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా కాషాయపు కుంకుమ రంగు దుస్తులు ధరించడం ఏంటి? అంటూ కూడా కామెంట్ పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అంతేకాదు ఈ సినిమా విడుదలను అడ్డుకుంటాము అంటూ కూడా చాలామంది పోరాటం చేశారు.

మరొకవైపు సెన్సార్ బోర్డు కూడా ఈ సినిమాలోని అసభ్యకర సన్నివేశాలను తొలగించాలి అని , అలాగే దీపికా పదుకొనే బికినీ సన్నివేశాలు కూడా తొలగించాలని తిప్పి పంపింది.. మళ్లీ సెన్సార్ బోర్డు కు పంపించారు చిత్ర సభ్యులు. ఎట్టకేలకు అన్ని సమస్యలను క్లియర్ చేసుకొని సినిమాను విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా ట్రైలర్ లాంచ్ డేట్ ని కూడా ప్రకటించడం జరిగింది. జనవరి 10వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేయబోతుండగా జనవరి 25వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.

సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షారుక్ ఖాన్ హీరోగా, దీపికా పదుకొనే హీరోయిన్గా, జాన్ అబ్రహం నటించిన ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 2 నిమిషాల 37 సెకండ్ల నిడివితో ఉండబోయే ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని తెలుస్తాయి. ఇటీవలే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా అందులో కింగ్ ఖాన్ , జాన్ అబ్రహం మధ్య వచ్చే సన్నివేశాలు ఉత్కంఠ భరితంగా ఉంటాయని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది..

Read more RELATED
Recommended to you

Latest news