RRR: `ఆర్ఆర్ఆర్‌` రిలీజ్‌పై కఫ్యూజన్ .. ఆ రోజైనా వ‌చ్చేనా?

-

RRR: బ‌హుబలితో తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచ వ్యాప్తం చేసినా ద‌ర్శ‌క దిగ్గ‌జం రాజమౌళి. ఇప్పుడూ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెర‌కెక్కిస్తున్న చిత్రం `ఆర్ఆర్ఆర్ (రౌద్రం.. రణం.. రుధిరం)`. పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి స్వ‌రాలు స‌మ‌కుర్చారు. ఈ మూవీలో ఆలియా భట్‌, ఒలివియా మోరీస్ లు మీరోయిన్‌గా నటుస్తున్నారు. తొలుత ఈ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా అక్టోబర్ 13న విడుదల చేస్తామని మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించినా.. ప‌లు కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డింది.

మ‌రోవైపు.. ఇప్ప‌టికే ఈ చిత్ర యూనిట్ విడుద‌లైన ట్రైల‌ర్‌, ఫ‌స్ట్ లూక్స్‌, ఇత‌ర అప్డేట్స్ అభిమానుల‌ను అమితంగా అల‌రించాయి. అంతేకాకుండా.. చాలా రోజులు త‌రువాత రాజ‌మౌళి డైరెక్ష‌న్ చేస్తున్న చిత్రం కావ‌డం, న‌ట‌దిగ్గ‌జాలు చెర్రీ, ఎన్టీఆర్‌లు న‌టిస్తున్న మల్టీ సార్ట‌ర్స్ కావ‌డంతో ఈచిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న రాజమౌళి అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే.. ఈ చిత్రం రిలీజ్‌ డేట్ విషయంలో మేకర్స్ కాస్త కఫ్యూజన్ గా ఉన్నారా అనిపిస్తుంది. సంక్రాంతి బ‌రిలో ప‌లు భారీ చిత్రాలు ఉంట‌డంతో రిలీజ్‌పై మళ్లీ సందేహాలు అలుముకున్నాయి. ప్రస్తుతానికి అయితే జనవరి 7న అని బజ్ వినిపిస్తుంది, లేదా సమ్మర్ కానుకగా మార్చి 31న గ్రాండ్ రిలీజ్ చేయాలని డేట్ లాక్ చేశారట. అంతేకాదు, కొత్త విడదల తేదీని అధికారికంగా త్వరలోనే ప్రకటించబోతున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news