సీఎం జగన్‌కు ధూళిపాళ నరేంద్ర లేఖ…ఇది దగా ప్రభుత్వం !

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్‌కు టీడీపీ నేత ధూళిపాళ నరేంద్ర లేఖ రాశారు. ఇది రైతు ప్రభుత్వమా..? దగా ప్రభుత్వమా అంటూ సీఎం జగన్‌కు ధూళి పాళ బహిరంగ లేఖ రాశారు. విద్యుత్‌ మోటార్ల కు మీటర్లు బిగించడం ద్వారా రైతుల్ని దొంగల్లా చూస్తున్నా రన్న భావన కల్పిస్తు న్నారని లేఖలో ధూళిపాళ నరేంద్ర పేర్కొన్నారు.

రైతు భరోసా అమ ల్లో కులం పేరు చెప్పి లబ్దిదారు ల్లో కోత విధించారని మండిపడ్డారు. రైతు భరోసా లబ్ది దారు లను రూ. 64 లక్షల నుంచి రూ. 45 లక్షలకు కుదించారని పేర్కొన్నారు ధూళిపాళ నరేంద్ర. రూ . 15 లక్షల కౌలు రైతుల కు రైతు భరోసా ఇస్తామని.. రూ . 49 వేల మందికే పరిమితం చేశారన్నారు ధూళిపాళ నరేంద్ర. పోలవరం నీటి సామర్ధ్యం ఎత్తును 150 అడుగుల నుంచి 135 అడుగులకు కుదించేశారు.డ్రిప్‌ ఇరిగేషన్‌, వ్యవసాయ యాంత్రీకరణ, మైక్రో న్యూట్రీయంట్స్‌ వంటి వాటిని పూర్తిగా వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టేసిందన్నారు.