బ్రేకింగ్ : ఏపిలో రిపబ్లిక్ సినిమాను అడ్డుకున్న వైసీపీ నేతలు

శ్రీకాకుళం జిల్లాలో హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన  “రిపబ్లిక్ ” సినిమా కు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ఎఫెక్టు తాకింది. ఇవాళ  “రిపబ్లిక్ ” సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల అయింది. అయితే శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేటలో రిపబ్లిక్ సినిమాను అడ్డుకున్నారు అధికార వైసీపీ పార్టీ నేతలు. రిపబ్లిక్ సినిమాకు వచ్చిన జనాలను వెనక్కి పంపిస్తున్నారు వైసీపీ శ్రేణులు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల ను ఖండిస్తూ తూ థియేటర్ వద్దనే వైసీపీ నేతలు ధర్నాకు దిగారు. వెంటనే పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ ఆందోళన చేపట్టారు. దీంతో నరసన్నపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యవహారంలో… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార పార్టీ మరియు ప్రతిపక్ష జనసేన పార్టీ ల మధ్య… తలెత్తిన వివాదం రోజు రోజుకీ ముదురుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లోనే సిఎం జగన్ మరియు ఏపీ మంత్రులపై పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.