విద్యార్థులకు అలర్ట్‌.. ఈ నెల 14 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

-

తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ- జూన్ 2023 పరీక్షలు జూన్ 14వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు జూన్ 8న ఓ ప్రకటనలో తెలిపారు.

CBSE Class 10 board exams cancelled, Class 12 board exams postponed | The  News Minute

పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి హాల్‌ టికెట్లు పొందాలని సూచించారు. పరీక్షలు ఉదయం 9.30 నిమిషాల నుంచి 12.30 నిమిషాల వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులు నిర్ణీత సమయానికి గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, నిషేధిత వస్తువులను పరీక్షా కేంద్రంలోనికి అనుమతించబడవన్నారు. టెన్త్ అకడమిక్ ప్రోగ్రాం (SSC), ఓరియంటల్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (OSSC) కోర్సులోని అన్ని సబ్జెక్టులకు ఆబ్జెక్టివ్ పేపర్ (పార్ట్ B) చివరి అరగంటలో మాత్రమే సమాధానం రాయవల్సి ఉంటుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news