ఎప్పటికైనా రెమ్యునరేషన్ తగ్గించుకుంటే బాగుంటుంది..?

-

కరోనా వైరస్ ప్రభావం దృష్ట్యా అన్ని రకాల కార్యకలాపాలు నిలిచిపోవడంతో అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరుస సినిమా విడుదల తో లాభాల బాటలో నడిచే చిత్ర పరిశ్రమ కూడా అన్ని రకాల కార్యకలాపాలు నిలిచిపోవడంతో తీవ్ర నష్టాల్లో కొట్టుమిట్టాడుతుంది. ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి సినిమా ప్రారంభించేందుకు అనుమతులు వచ్చినప్పటికీ చిత్ర పరిశ్రమలు మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో సంక్షోభం నుంచి తేరుకోలేక పోతున్నాయి. ఈ క్రమంలోని పలు చిత్రపరిశ్రమలలో నటులు తమ పారితోషికం తగ్గించుకుని చిత్ర పరిశ్రమకు అండగా నిలబడిన విషయం తెలిసిందే.

ఇక ఇటీవల ఇదే విషయంపై స్పందించిన ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా.. తమిళ చిత్ర పరిశ్రమలో నటులు సహా మరికొంతమంది పారితోషికాన్ని తగ్గించుకుంటే బాగుంటుంది అని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ సహా మలయాళ చిత్ర పరిశ్రమలో నటులు కూడా తమ పారితోషికాన్ని 30 నుంచి 40 శాతం తగ్గించుకున్నారని.. తమిళ చిత్ర పరిశ్రమలో కూడా ఇలా పారితోషికం తగ్గించుకుని షూటింగ్లను పునరుద్ధరించడానికి అందరూ మద్దతు ఇవ్వాలి అని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news