స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు పెళ్లి ఫిక్స్ …!

-

బాలీవుడ్ లో నాలుగు దశాబ్దాలుగా హీరోగా చేస్తూ ఇప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్న దక్కించుకున్న హీరో అమీర్ ఖాన్.. ఖాన్ త్రయంలో ఒకరిగా పోటా పోటీగా సినిమాలను తీస్తూ వస్తున్నాడు. ఈ తరం కుర్ర హీరోలకు ధీటుగా యాక్షన్ సీక్వెన్స్ లు చేస్తూ అబ్బురపరుస్తున్నాడు. ఇక లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం అమీర్ ఖాన్ ఇంట్లో పెళ్లి భాజాలు మోగనున్నాయట. అమీర్ ఖాన్ కు ఐరా ఖాన్ అని ఒక అందాల కూతురు ఉంది.. ఈమెకు పెళ్లి చేయడానికి అమీర్ నిర్ణయం తీసుకున్నారు. ఐర ఖాన్ కు ఫిట్ నెస్ ట్రైనర్ గా ఉన్న నుపుర్ శిఖరే తో పెళ్లి చేయడానికి పెద్దలు నిశ్చయించారు. అందులో భాగంగా నవంబర్ 18న నిశ్చితార్థం మరియు 2024 లో జనవరి 3న పెళ్లి చేయడానికి ముహూర్తం ఖరారు అయింది. ఈ విషయాన్నీ అమీర్ ఖాన్ ఒక ఇంటర్ వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చారు.

ఇక నుపుర్ అనే వ్యక్తి ఐరా ఖాన్ డిప్రెషన్ లో ఉన్నప్పుడు మానసికంగా తనకు తోడుగా ఉన్నాడట. ఇక నుపుర్ ఇండస్ట్రీ లో చాలా మందికి ఫిటినెస్ ట్రైనర్ గా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news