అతిలోక సుందరి తో వివాహాన్ని క్యాన్సిల్ చేసుకున్న స్టార్ హీరోస్..!!

-

అలనాటి అందాల తార శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఈమె అందంతో ,నటనతో ఎంతో మంది ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఇక స్టార్ హీరోలతో సైతం ఈమె నటించి ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. శ్రీదేవి ఒక టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్ కోలీవుడ్ లో కూడా సినిమాలు చేసి తన హవా కొనసాగించిందని చెప్పవచ్చు. అయితే అప్పట్లో నేషనల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి బాలీవుడ్ నిర్మాత అయిన బోనికపూర్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే ముందు శ్రీదేవి పెళ్లి విషయంలో ముగ్గురు హీరోల పేర్లు వినిపించాయి వాటి గురించి చూద్దాం.

మొదటగా యాంగ్రీ యంగ్ మాన్ హీరో రాజశేఖర్ శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలని శ్రీ దేవి తల్లి స్వయంగా రాజశేఖర్ ను కోరిందట అయితే అప్పుడు రాజశేఖర్ కెరియర్ పరంగా బిజీగా ఉండడంతో నో చెప్పారట. స్వయంగా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలియజేశారు ఆయన.

ఇక మరొక నటుడు మురళీమోహన్ శ్రీదేవి పెళ్లి అంటూ టాక్ వినిపించింది కానీ అప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న మురళీమోహన్ శ్రీదేవితో పెళ్లికి నో చెప్పడం జరిగిందట.

ఇక ఆ తరువాత మరి కొద్ది రోజులకు బాలీవుడ్ హీరో మిధున్ చక్రవర్తి శ్రీదేవి ప్రేమలో పడింది చాలా రోజుల పాటు వీరిద్దరి సీక్రెట్ గా సహజీవనం కూడా చేశారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ మిథున్ చక్రవర్తి మొదటి భార్య వదిలేస్తే.. నే తన కూతురు అయిన శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలని కండిషన్ ని పెట్టిందట శ్రీ దేవి తల్లి.. అయితే తన మొదటి భార్య యోగితను వివాహం చేసుకున్న తరువాతే తనకు బాగా కలిసి వచ్చిందని మిధున్ చక్రవర్తి చెప్పడం తో చివరికి ఆ వివాహం కూడా క్యాన్సిల్ అయింది.

కానీ చివరికి బోనీకపూర్ శ్రీదేవి వివాహం చేసుకుంది. ఇక వీరిద్దరూ వివాహ సమయానికి శ్రీదేవి గర్భవతి కావడంతో వీరి వివాహం హడావిడిగా జరిగిపోయిందని ఇప్పటికీ చాలామంది అంటూ ఉంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version