స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి శుభవార్త..!

-

దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. చాలా మంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే సేవలని పొందుతున్నారు. అయితే తాజాగా ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ ఓ శుభవార్త ని చెప్పింది. క్రెడిట్ కార్డుల సంస్థల్లో ఒకటైన ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ ఎలాంటి మార్పులు చేసింది అనేది చూద్దాం.

పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్. కస్టమర్ల కోసం కొత్త కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను తీసుకు వచ్చింది. ఏకంగా ఇప్పుడు మూడు కొత్త క్రెడిట్ కార్డులను తీసుకు వచ్చింది. ఇక వాటి వివరాలని చూస్తే.. ఎస్‌బీఐ కార్డు ఎలైట్, పీఎస్‌బీ ఎస్‌బీఐ కార్డు ప్రైమ్, పీఎస్‌బీ సింప్లీ సేవ్ ఎస్‌బీఐ కార్డులని తీసుకు వచ్చింది. ప్రీమియం కస్టమర్లు కోసం ఎస్‌బీఐ కార్డు ఎలైట్, పీఎస్‌బీ ఎస్‌బీఐ కార్డు ప్రైమ్ ని తీసుకు వచ్చారు.

పీఎస్‌బీ సింప్లీ సేవ్ ఎస్‌బీఐ కార్డు ఉంటే రివార్డ్ పాయింట్స్ కూడా ఇస్తారు. ఇలా ఈ కార్డుల వలన మనం ఎన్నో లాభాలని పొందేందుకు అవుతుంది. కొత్త కస్టమర్లను పొందటానికి కూడా పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌ తో భాగస్వామ్యం ఉపయోగ పడుతుంది. ఎస్‌బీఐ కార్డు ఎండీ, సీఈవో రామ మోహన్ రావు ఈ విషయం గురించి చెబుతూ ఈ భాగస్వామ్యం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news