ఎడిట్ నోట్: ఏపీలో ‘కారు’కు కాపు..!

-

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్..బీఆర్ఎస్ పార్టీని విస్తరించే దిశగా ముందుకెళుతున్నారు. తెలుగు ప్రజలు ఎక్కువ ఉన్న రాష్ట్రాలపై కేసీఆర్ ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇదే క్రమంలో పక్కనే ఉన్న ఏపీపై ఎక్కువ ఫోకస్ పెట్టారు..అక్కడ బీఆర్ఎస్ పార్టీని విస్తరించడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే అక్కడ పార్టీ ఆఫీసు మొదలుపెట్టారు. ఇక ఏపీలో కొందరు నేతలు కేసీఆర్‌కు మద్ధతు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో పలువురు కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి రెడీ అయ్యారు.

ఇదే క్రమంలో కాపు వర్గానికి చెందిన నేత తోట చంద్రకేఖర్..బీఆర్ఎస్ లో చేరడం ఖాయమైంది. అలాగే ఈయనకు ఏపీ బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు అప్పజెప్పనున్నారు. రిటైర్డ్ ఐ‌ఏ‌ఎస్ అధికారి అయిన తోట..2009లో ప్రజారాజ్యంలో ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు.  ఆ ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లారు. 2014 ఎన్నికల్లో ఏలూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల ముందు జనసేనలోకి వెళ్ళి..ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

అయితే ఇప్పుడు ఈయన బీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఈయనకు కేసీఆర్ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తున్నారు. అటు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు సైతం బీఆర్ఎస్ లో చేరుతున్నారని తెలిసింది. ఇక వరుసపెట్టి బీఆర్ఎస్ లోకి వలసలు కొనసాగేలా ఉన్నాయి. అంటే  ప్రధాన పార్టీల్లో ఉండే అసంతృప్తి నాయకులు బీఆర్ఎస్ లో చేరే ఛాన్స్ ఉంది. ఇక కాపు వర్గానికి చెందిన తోటకు అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం వెనుక..కాపు ఓటర్లని ఆకర్షించే ప్రయత్నం జరుగుతుందని చెప్పవచ్చు.

ఒకవేళ కాపు ఓటర్లని ఆకర్షిస్తే..పరోక్షంగా టీడీపీ-జనసేనలకే నష్టం జరగవచ్చు. కానీ అది ఇప్పటిలో జరిగే పని కాదు..ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఏపీలో బలపడటం ఇప్పుదు అంత ఈజీ కాదు. ఇక సొంత బలం లేని తోటని అధ్యక్షుడుగా పెట్టినంత మాత్రాన కాపు ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి మద్ధతు ఇస్తారని అనుకోవడం పొరపాటే. కాకపోతే కొంతకాలం ఏపీలో బీఆర్ఎస్ హడావిడి ఉండవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news