రామ్ చరణ్ బాటలో పవన్ కళ్యాణ్..అందుకేనా..?

-

రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ మధ్య అబ్బాయి బాబాయ్ రిలేషన్షిప్ కాకుండా మంచి స్నేహబంధం ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇదే విషయాన్ని రామ్ చరణ్ ఎన్నోసార్లు మీడియాతో కూడా చెప్పుకొచ్చారు. అయితే వీరిద్దరికీ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవరి స్టైల్ లో వారు సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇప్పుడు తాజాగా వీళ్ళిద్దరూ ఒకేసారి ఒకే తరహా పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ఈ మెగా హీరోలు ఇద్దరు చేస్తున్న ఆ పాత్రలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

చిరంజీవి బాటలో కెరియర్ లో తొలిసారి అలాంటి పాత్రలో పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ నటించ బోతున్నారు. ఇది చూసిన మెగా అభిమానులు తెగ ఖుషి అవుతున్నారు. చిరంజీవి తన కెరీర్ లో బిల్లారంగ, బందిపోటు సింహం, రిక్షావోడు, స్నేహం కోసం, అందరివాడు వంటి సినిమాలలో తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే. తొలిసారి పవన్ కళ్యాణ్ కూడా వయసు మళ్ళిన తండ్రి పాత్రలో నటించనున్నాడు. కెరియర్ లో మొదటిసారి పవన్ కళ్యాణ్ ఫాదర్ క్యారెక్టర్ తో పాటు కుమారుడిగా రెండు విభిన్న పాత్రల్లో అలరించనున్నట్టు సమాచారం.

హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోయే చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ తండ్రి కొడుకులు గా డ్యుయల్ రోల్ చేయనున్నట్టు సమాచారం. ఇందులో ఒకటి లెక్చరర్ పాత్ర.. మరొకటి ఐ బి ఆఫీసర్ క్యారెక్టర్ అని సమాచారం. ఇప్పుడు మరొకవైపు రాంచరణ్ కూడా శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో తొలిసారి తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ముందుగా ఈ పాత్ర కోసం చిరంజీవి, పవన్ కళ్యాణ్, లేకుంటే మోహన్ లాల్ లాంటి వేరే హీరోలను అనుకున్నా ఫైనల్ గా రాంచరణ్ ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయడానికి అంగీకరించారు. ఇందులో తండ్రి పాత్రకు అంజలి హీరోయిన్ గా నటిస్తోంది. కొడుకు పాత్రకు కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news