స్టేట్ బ్యాంక్ నుండి సూపర్ స్కీమ్… ప్రతీ నెలా డబ్బులు..!

-

చాలా మంది నచ్చిన స్కీమ్స్ లో డబ్బులని పెడుతూ వుంటారు. ఇలా డబ్బులు పెడితే చక్కటి బెనిఫిట్స్ ని పొందొచ్చు. రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బుల్ని ఎక్కడ పెడితే మంచి రిటర్న్స్ వస్తాయి అని కూడా చాలా మంది సీనియర్ సిటిజన్లు చూస్తూ వుంటారు. అయితే బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటే రిస్క్ తక్కువ ఉంటుంది.

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ఎన్నో రకాల స్కీములని తీసుకు వచ్చింది. స్టేట్ బ్యాంక్ తీసుకు వచ్చిన స్కీములలో ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి. ఇక పూర్తి వివరాలని చూద్దాం. ఇందులో ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బులు డిపాజిట్ చేసారంటే ప్రతీ నెలా కొంత అకౌంట్‌లో పడతాయి. వాటితో పాటు వడ్డీ కలిపి అకౌంట్‌లో పడతాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో డబ్బులు జమ చేస్తే మెచ్యూరిటీ సమయంలో అసలు, వడ్డీ కూడా పడతాయి.

యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో ప్రతీ నెలా అకౌంట్‌లో డబ్బులు వస్తాయి. టర్మ్ డిపాజిట్‌కు ఉన్న వడ్డీ రేట్లే యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌ కి కూడా వర్తిస్తాయి. అరశాతం వడ్డీ ఎక్కువగా వస్తుంది సీనియర్ సిటిజన్లకు. ఇందులో డబ్బులని పెట్టేవాళ్ళు 36 నెలలు, 60 నెలలు, 84 నెలలు లేదా 120 నెలల ని ఎంచుకోవాల్సి ఉంటుంది. దీనిలో ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. కనీస మంత్లీ యాన్యుటీ రూ.1,000 లభిస్తుంది. ఏ రోజున డబ్బులు డిపాజిట్ చేస్తే.. వచ్చే నెల అదే రోజున మీ అకౌంట్‌లో డబ్బులొస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news