తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట్ర కేబినేట్ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ ఆధ్యక్షతన జరిగే సమావేశంలో కరోనా వ్యాప్తి కారణంగా నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం ఉందని తెలుస్తుంది. నైట్ కర్ఫ్యూతో పాటు పలు ఆంక్షలు కూడా అమలు చేసే అవకాశం ఉంది. దీంతో పాటు ఈ సమావేశంలో ధరణి పోర్టల్ సమస్య లపై, నీటి పారుదల ప్రాజెక్టులతో మరి కొన్ని అంశాలలో చర్చించే అవకాశం ఉంది. అలాగే వైద్య కళాశాలలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంతో పాటు స్టేట్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు కూడా కేబినేట్ ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి.
ఉద్యోగులకు సంబంధించి బదీలు, ఖాళీల భర్తీ గురించి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అలాగే యూనివర్సిటీలలో ఉండే అధ్యాపకుల పదవీ విరమణ వయస్సు ను కూడా పెంచడం పై కూడా ఈ కేబినేట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అలాగే ఇటీవల ఎరువుల ధర పెరిగిన విషయం తెలిసిందే. ఎరువుల ధరపై ప్రభుత్వం వ్యవహరించాలి అనే దానిపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన చర్చించనున్నారు. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ఇతర పథకాల గురించి కూడా చర్చించే అవకాశం ఉంది.